భారత
మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 ఫార్మాట్‌కు గుడ్ బై
చెప్పింది. భారత టీ-20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు
స్వీకరించిన మిథాలీ ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం
2364 పరుగులు చేసి టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా
నిలిచింది. అలాగే 2012, 14, 16 ప్రపంచకప్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించింది.
`2006 నుంచి భారత్ తరఫున టీ-20లు ఆడుతున్నాను. ఇప్పుడు టీ-20లకు
రిటైర్మెంట్ ప్రకటించి 2021లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి
సారించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు అండగా నిలిచిన బీసీసీఐకు
ధన్యవాదాలు` అని మిథాలీ పేర్కొంది.