భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం ఇక్కడి రాఘవేంద్ర కల్యాణమండపంలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్‌ను సంప్రదాయబద్ధంగా అశ్విన్ వివాహం చేసుకున్నాడు. గత వారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 9వికెట్ల తీసిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట కోల్‌కతా వెళ్లే అవకాశం ఉంది. కోల్‌కతాలో సోమవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ అడాల్సి ఉన్న విషయం విదితమే.