‘బర్మా’, ‘జాక్సన్ దురై’ ఫేమ్
ధరణిధరన్ దర్శకత్వంలో తాజాగా
తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా
రంగుస్కి’. ‘మెట్రో’ ఫేమ్ హిరీష్,
‘విల్ అంబు’ నాయిక శాంథిని
జంటగా నటిస్తున్నారు. శక్తివాసన్,
బర్మా టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న
ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా
సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే
తొలిషెడ్యూల్ చిత్రీకరణను
పూర్తి చేశారు. సోమవారం నుంచి
రెండో షెడ్యూల్ చిత్రీకరణ
ప్రారంభం కానుంది. ఇందుకోసం
తరమణిలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం
చేశారు. సినిమా గురించి దర్శకుడు
మాట్లాడుతూ మేం అనుకున్నదానికన్నా
సినిమా చిత్రీకరణ శరవేగంగా
సాగుతోంది. 50 శాతం పైచిలుకు చిత్రీకరణ
పూర్తయింది. ఇదేవేగంతోనే సినిమా
చిత్రీకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం.
కథా నాయకుడు హిరీష్ తన పాత్రను
అద్భుతంగా పోషిస్తున్నారు.
ప్రేమ సన్నివేశాల్లో కూడా మేం
ఆశించినట్లుగానే నటించారు.
కానీ కథానాయికకు ముద్దుపెట్టే
సన్నివేశంలో మాత్రం ఆయన చాలా
ఇబ్బందికరంగా నటించారు. కానీ
మేం అనుకున్నట్లుగా రాలేదు.
అందువల్ల ముద్దు సన్నివేశానికి
ఏకంగా 19 టేకులు తీసుకున్నారు.
ఇతర సన్నివేశాలకు సంబంధించిన
పనులన్నీ సిద్ధమయ్యాయి. రెండో
షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నామన్నారు.