షారుఖ్‌ఖాన్ నటించిన హ్యాపీ
న్యూ ఇయర్ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత
రికార్డులన్నింటినీ చేరిపి వేస్తూ మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల క్లబ్‌లో
చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ
సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద
దూసుకుపోతోంది. తొలి రోజు దాదాపు 44 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి
బాలీవుడ్ వర్గాల్ని విస్మయపరిచిన ఈ చిత్రం వారంతానికి 108.86 కోట్ల
వసూళ్లకు చేరుకోవడం గమనార్హం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో
షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటించింది.