భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడోవ వన్డేలో భారత్ 49.2 బంతులలో 300 పరుగులు చేసి విజయం సాధించింది. ఐదు వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనరు కుక్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. వన్ డౌన్‌గా వచ్చిన ట్రాట్ 116 బంతులల్లో ఎనిమది పోర్లు సహయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు చివరికి రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. పీటర్సన్ 64, పటేల్ 70, బోపరా 24 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో ప్రవీణ్ కుమార్, వినరుకుమార్ , కోహ్లీ , జడేజా చెరో వికెటు తీసుకున్నారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంకా నాలుగు బంతులు మిగిలి వుండగానే విజయం లక్ష్యం సాధించింది. భారత్ బ్యాట్స్‌మెన్‌లు అందరు కలిసి కట్టుగా అడి విజయం సాధించారు. పటేల్ 38, రెహ్మన్ 91, గంభీర్ 58, కోహ్లీ 35, రైనా 0 పరుగులు చేశారు. ధోని 35, జడేజా 26 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు.