Friday, January 14, 2011
రెండో ఆటలో చూడాలి ఎవరిదో .........
తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు రెండో వన్డే ప్రతికారం తీసుకుంటుందా లేదా పెవిలియన్‌కు చేరుకుంటుందా. రేపు సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మొదటి వన్డేలో కోహ్లి ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పై చెయి సాధించింది. రెండో వన్డేలో ఎవరిపై ఎవరు ప్రతాపం చూపిస్తారో చూడాలి. తొలి వన్డేలో ఓపెనర్లు ఇద్దరు విఫలమయ్యారు. చాలా కాలం తరువాత వన్డేలో సచిన్ ఆడినపప్పటికీ విఫలమై నిరాశ పరిచాడు. ఇంకా రెండు వన్డేలో సచిన్ ప్రతాపం చూపాలి. అలాగే బౌలర్లలు కూడా వారివారి సత్తా చాటాలి. యువరాజ్ సింగ్ కూడా మరో సారి తన సిక్స్‌లా వర్షం కూరిపిచాలి. బౌలింగ్‌లో ఎంతో కొంతో రాణించగలుతున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాలి.
17న ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక
ఉపఖండంలో జరగనున్న ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌కు 15మంది భారత ఆటగాళ్లను చెన్నరులో జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 17న ఎంపిక చేయనుంది. తొలిదశలో ఎంపిక చేసిన 30మంది ఆటగాళ్లలో నుంచి తుది జట్టును కృష్టమాచారి శ్రీకాంత్ నేతృత్వలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. పరిమిత ఆటగాళ్లను ఐసిసి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. 2011 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగుతుంది. భారత జట్టు గ్రూపు బి లో ఆడుతుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లండ్, నెదర్లండ్స్ ఈ గ్రూపులో ఆడే మిగతా జట్లు.సమర్థవంతమైన అల్‌రౌండరల్లకోసం సెలక్షన్ ప్యానల్ అన్వేషిస్తోంది.
ప్రపంచ కప్ తర్వాత రజాక్ రిటైర్మెంట్
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ 2012 టి20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించాడు. 'నా ఆలోచన ప్రకారం టి20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావడమే సరైన సమయం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రజాక్ పేర్కొన్నాడు. రజాక్ పాకిస్తాన్ టీమ్‌కు ఆల్ రౌండర్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. రిటైర్‌మెంట్ ప్రకటించడం అనేది ప్రతి సీనియర్ క్రికెటర్‌కు కష్టమైన నిర్ణయం. ఆటగాడి పిట్‌నెస్ ఆటను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రజాక్ తెలిపాడు. 'నా ఫామ్, ఫిట్‌నెస్‌ను బట్టి నేను 2012 టి20 ప్రపంచ కప్ వరకూ బాగా ఆడగలనని అనుకుంటున్నాను. ఈ సమయం నా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాను. ు. ఇది నాకు ఎంతో కీలకమైంది' అని రజాక్ అన్నాడు.
కివీస్‌తో వన్డే సిరీస్‌కు అఫ్రిదీకే పగ్గాలు
న్యూజిలాండ్ క్రికెట్ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ప్రస్తుత కెప్టెన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీయే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే నెల ప్రపంచకప్‌క కూడా అఫ్రిదీనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా అన్న అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
జట్టు వివారలు : షాహిద్ ఆఫ్రిదీ ( కెప్టెన్ ), మొహ్దన హఫీజ్, అహ్మద్ షాజాద్, యూనిస్ ఖాన్, ఉమర్ అక్మల్, మిస్బాహుల్ హాఖ్, అసద్ షషీఖ్, అబ్దుల్ రజాక్, కామ్రాన్ అక్మల్, షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, అబ్దుల్ రెహ్మాన్, సయూద్ అజ్మల్.
జట్టు వివారలు : షాహిద్ ఆఫ్రిదీ ( కెప్టెన్ ), మొహ్దన హఫీజ్, అహ్మద్ షాజాద్, యూనిస్ ఖాన్, ఉమర్ అక్మల్, మిస్బాహుల్ హాఖ్, అసద్ షషీఖ్, అబ్దుల్ రజాక్, కామ్రాన్ అక్మల్, షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, అబ్దుల్ రెహ్మాన్, సయూద్ అజ్మల్.
Subscribe to:
Posts (Atom)