Friday, November 7, 2014

వెంకటేష్ సరసన నదియా?

ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ కథానాయిక నదియా ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో కీలక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. త్వరలో ఆమె హీరో వెంకటేష్‌కు జోడీగా కనిపించనుందని తెలిసింది. గోపీచంద్‌తో సాహసం వంటి వినూత్న చిత్రాన్ని అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 


           వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని, ఒక పాత్రకు జోడీగా నదియా నటించనుండగా మరో పాత్ర సరసన ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.