Sunday, December 25, 2011

‘కాంగారు’ పెట్టాలి.. చరిత్ర సృష్టంచాలి!

ఆరున్నర దశాబ్దాలుగా సుదీర్ఘ నిరీక్షణ.. ఆసీస్ గడ్డపై సిరీస్ నెగ్గాలని!
ఒకటికాదు రెండుకాదు.. తొమ్మిది
సిరీస్‌లు ఆడాం! లాలా అమర్‌నాథ్ నుంచి మొదలుపెడితే కుంబ్లే వరకు.. ఇలా గండరగండల్లాంటి సారథుల హయాంలోని జట్లన్నీ రిక్తహస్తాల్తో
తిరిగొచ్చిననవే! మరి ఈ సారి? ధోనీసేనా మునుపెన్నడూలేనంత
పటిష్ఠంగా అగుపిస్తోంది! అందుకే ఆశలు చిగురిస్తున్నాయ్.. తొలిసారిగా అక్కడ సిరీస్ విక్టరీ కొట్టి చరిత్ర సృష్టిస్తామని! 

ఈ అంచనాకు తగ్గట్టుగానే...
ఓపెనింగ్‌లో సెహ్వాగ్, గంభీర్‌లు
శుభారంభాలతో కదంతొక్కాలని ఆశిద్దాం!
బిగ్ త్రయం సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లు
హిట్టవ్వాలని కోరుకుందాం!
పేసర్లు జహీర్, ఇషాంత్, ఉమేశ్‌లు ప్రత్యర్థిని చిత్తుచేయాలని ఆశిద్దాం!!

ఇరుజట్ల మధ్య ఎంతో తేడా!
ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఆడడం ఒక్కటే అత్యంత అనుకూలం కావొచ్చు. కానీ బలాబలాల దృష్ట్యా ధోనీసేనతో క్లార్క్‌మెన్ ఏ రకంగానూ సరిజోడు కాదు. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన మాజీలూ అంగీకరించారు. సెహ్వాగ్, గంభీర్‌ల రూపంలో మన ఓపెనింగ్ జోడీ అత్యంత పటిష్టంగా ఉంది. వీరూ వంద టెస్ట్ (92)లకు దగ్గరవుతుంటే.. గంభీర్ (44) యాభై టెస్టులకు సమీపిస్తున్నాడు. అదే ఓపెనర్ల విషయానికొస్తే.. వారిది అనుభవలేమి. వార్నర్ ఆడింది కేవలం 2 టెస్టులే అయితే, కొవాన్ ఇంకా బోణీయే చేయలేదు. ఇక ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌ల రూపంలో మన మిడిలార్డర్ అత్యంత బలోపేతం. ఈ విషయంలో పాంటింగ్, క్లార్క్, హస్సీల రూపంలో ఆసీస్‌కూ అనుభవజ్ఞులే ఉన్నారు. కానీ మన దిగ్గజ త్రయం అద్భుత ఫామ్‌లో ఉంటే.. ఈ ముగ్గురు మాత్రం వారి వారి కెరీర్‌లలోనే అత్యంత పేలవఫామ్‌లో కొనసాగుతున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలోనూ ఆసీస్‌తో పోలిస్తే, జహీర్, ఇషాంత్‌ల రూపంలో అనుభవజ్ఞులతో భారత్ పేస్ విభాగం బలంగానే ఉంది. వారి జట్టులో సిడిల్ ఒక్కడే అనుభవజ్ఞుడు. హిల్ఫెన్హాస్, ప్యాటిన్సన్‌లు.. ఉమేశ్‌కుమల్లే కొత్తే. స్పిన్ విభాగంలో అశ్విన్ కొత్తేఅయినా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు.


జహీర్, ఇషాంత్‌లకు పరీక్ష
భారత్ బౌలింగ్ ఆశలన్నీ జహీర్, ఇషాంత్‌లపైనే ఉ న్నాయి. ఐతే.. వీరికి ఫిట్‌నెస్సే అసలు సమస్య. వరుస గా రెండు టెస్టులాడితే.. మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. భారత్ బౌలింగ్ హిట్టా... ఫట్టా? అనేది వీరిద్దరి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడివుంటుందనేది విశ్లేషకుల అభివూపాయం. ఆస్ట్రేలియా పిచ్‌లు పేసర్లకే సహకరిస్తాయి కాబట్టి ఈ అంచనాను ఏ మాత్రం తక్కువచేయలేం. ఇంగ్లండ్ టూర్ నుంచి గాయంతో అర్ధంతరంగా వైదొలిగిన జహీర్‌కు ఆ తర్వాత ఇదే తొలి టెస్ట్ సిరీస్. విండీస్‌తో సిరీస్‌లో ఇషాంత్ ఆడినా.. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. ఈ ఇద్దరి ఫిట్‌నెస్, ఫామ్ స్పష్టమయ్యేది తొలి టెస్ట్ ముగిశాకే!

2012 సంవత్సరంలో జనవరి ప్రస్తుతం నాలుగు సినిమాలు తెరపైకి వస్తున్నాయి ...

 2012 సంవత్సరంలో టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ఉండబోతుంది. సంక్రాంతి ముందు రోజు అతర్వాత రోజు, మరుసటి రోజు, ఇలా నాలుగు రోజుల పాటు సినిమా సందడి వుంటుంది. జనవరి 11న మహేష్‌ బాబు, కాజోల్‌ నటించిన ' బిజినెస్‌ మేన్‌తో సందడి కాబోతుంది. ఆ తరువాత రోజు 12న వెంకటేష్‌, త్రిష్‌ కాంబినేషన్‌లో ' బాడీగార్డ్‌ ' బారీ అంచనాలతో విడుదల అవుతుంది. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్‌లో రెండు సినిమాలు విడుదల కాగా ఇంకా మూడో సినిమా హిట్‌ కోట్టి హాట్రిక్‌ సాదించాలని అశిస్తున్నారు. ఇంకా మరుసటి రోజు రవితేజ, థీక్షాసేధ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ' నిప్పు' విడుదల సిద్దం అవుతుంది. వీటితో పాటు మరో సినిమా విడుదల సిద్దం కాన్నుంది. ' పులరంగడు' సునిల్‌ హీరోగా నటించిన సినిమా వీటితో పాటు విడుదలకు ' సై ' అంటున్నాడు. జనవరి 11 నుంచి 14 వరకు ధియేటర్లు మంచి కలెక్షన్‌లు, రికార్డులు బద్దలు కోట్టుకునే అవకాశం ఉంది. వీటి కన్నా ముందుగానే డిసెంబర్‌ 29న నందమూరి తారక్‌ నటించిన ' నందీశ్వరుడు' విడుదల సిద్దం కాన్నునంది. అలాగే 30న విక్రమ్‌ నటించిన సినిమా ' వీడింతే ' కూడా రిలీజ్‌ అవుతుంది.