తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన అందాల తార
అసిన్ వివాహం మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో మంగళవారం
ఉదయం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్ లో
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. గత కొంతకాలంగా
రాహుల్, అసిన్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం
క్రైస్తవ ఆచారం ప్రకారం జరిగిన పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు
సమాచారం.
సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ
డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ప్రత్యేకంగా
తయారుచేయిస్తున్న పది వరుసల ఎత్తున్న కేకును దంపతులు కట్ చేయనున్నారు. ఇక
పెళ్లి విందులో పూర్తి శాఖాహార భోజనం వడ్డించనున్నారు. అలాగే ఫిల్మ్
ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో జనవరి 23న ముంబైలో వీరి వివాహ రిసెప్షన్
జరుగనుంది.