Wednesday, April 13, 2011

తీన్‌మార్‌ నేడే విడుదల

 తీన్‌మార్‌ సినిమా నేడు విడుదల. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధికంగా 1150 ధియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ఖుషీ అంతగా సూపర్‌ హిట్‌ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నటీనటులు పవన్‌కళ్యాణ్‌, త్రిష, కృతి కర్బంద, పరేష్‌ రావల్‌, సోనూసూద్‌, ముఖేష్‌ రుషి, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో పాటలు ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది వచ్చింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది అని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం

 ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 361 పరుగులు చేసింది. ఓపెనరు వాట్సన్‌, రిక్‌పాటింగ్‌ వచ్చారు. వాట్సన్‌ 40 బంతులలో 72 పరుగులు చేశారు. పాటింగ్‌ మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అతను కూడా మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. స్మిత్‌ 5 పరుగులు చేశాడు. హుస్సీ 91 బంతులలో 108 పరుగులు చేశాడు. జాన్నస్‌ 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ 362 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనరు తమిమ్‌ ఇక్‌బాల్‌ 17 బంతులలో 32 పరుగులు చేశాడు. మరో ఓపెనరు క్యాయుస్స్‌ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. (93) నఫీస్‌ 60, మహ్మదుల్లా 68, పరుగులు చేశారు. మిగిలినా బ్యాట్స్‌మైన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అయ్యాడు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ హుస్సీ, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వాట్సన్‌.

100 శాతం ప్రేమగీతాలు


నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్‌గా అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం '100% లవ్‌'. చిత్ర గీతాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున ఆడియోను విడుదలచేసి హీరో రామ్‌, నిర్మాత బన్నీవాసుకు అందజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బన్నీ మాట్లాడుతుంటే నా అభిమానులు చప్పట్లు కొడుతున్నారు. నా ఫ్యాన్స్‌ ఎలా ఉంటారో చూపించారు. నాగ చైతన్య గీతా ఆర్ట్స్‌లో చేయటం, దానికి సుకుమార్‌ దర్శకుడు అవటం ఆనందంగా ఉంది. పాటలు విన్నాను. బాగున్నాయ
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...'మూడు తరాలుగా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నా అందరూ నాకు కావలిసనవాళ్ళే. మా నాన్న, నా దర్శకుడు, నా కథానాయిక, హీరో నా మిత్రుడు. ఈ సినిమాను చూశాను. డెఫనెట్‌గా హిట్టే. నాగచైతన్యను కొత్తగా చూస్తారు. తమన్నా కెరీయర్‌లో బెస్ట్‌ సినిమా అవుతుంది.
తమన్నా మాట్లాడుతూ...'సినిమాలో కొన్ని సీన్స్‌ చేస్తుంటే నా జీవితంలో లవ్‌స్టోరీ కూడా ఇలాగే ఉంటే బాగుండు అని అనుకున్నాను. సినిమాకు నా వాయిస్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చెప్పలేదు. గీతా ఆర్ట్స్‌లో చేయడమనేది గర్వంగా ఉంది. ఇందులో 'డియోలో డియాలో..' పాటకు యూనిట్‌ అంతా డాన్స్‌ వేశారు. సినిమా తర్వాతకూడా ప్రేక్షకుడు డాన్స్‌ చేస్తారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామానాయుడు, ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.