బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్..
వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లుగా కొంతకాలంగా బీటౌన్‌లో
వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్ ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది
సోనమ్.
ఇటీవల సోనమ్‌కపూర్.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్.. ‘‘లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండి. నా పర్సనల్ విషయాల గురించి అంతకంటే ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని నేను చాలా పవిత్రంగా భావిస్తున్నా. కాబట్టి నా వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.’’ అని చెప్పుకొచ్చింది సోనమ్ కపూర్.