Thursday, March 17, 2016

'బాహుబలి 2లో నటించడం లేదు'


 తాను 'బాహుబలి 2' సినిమాలో నటించడం లేదని హీరోయిన్ శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించిన దగ్గుబాటి రానాకు జోడీగా శ్రియ నటించనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ తోసిపుచ్చింది. 'బాహుబలి 2'లో తాను లేనని వెల్లడించింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఆమె పాల్గొంది. డిజైనర్ కనిజ సలూజ డిజైన్ చేసిన దుస్తులు ధరించి ర్యాంప్ పై మెరిసిపోయింది.
         ఈ సందర్భంగా విలేకరులు 'బాహుబలి 2' గురించి అడగ్గా... ఈ సినిమాలో నటించమని తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. ఈ చిత్రం నటించాలని ఉన్నా తనకు అవకాశం రాలేదని వెల్లడించింది.
            'బాహుబలి' తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన దర్శకుడు రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. ఈ పాత్ర ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌ లో నటించిన 'బాహుబలి 2' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

No comments:

Post a Comment