హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న
లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు.
అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు.
హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు
కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్
హీరోయిన్‌గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా
నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ
తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం
కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు
అనుమానంగా వచ్చిందా?
పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు
వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా
హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని
పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న
ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన
వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా
పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు
కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు
సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్
చేయించుకోవడం విశేషం.