నటి శ్రుతిహాసన్ మహిళా దినోత్సవం
సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం
చేయనున్నారట. సంగీత దర్శకులు
ఎహ్‌సాన్ నూరానీ, లాయ్ మెన్‌డోన్కాలతో
కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు.
మహిళలను చైతన్య పరిచే దిశగా
ఈ పాటను రచించినట్లు శ్రుతి
పేర్కొన్నారు. స్త్రీలకు కలలు
కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు
పాల్పడాలనే ఆలోచనలు రాకుండా
చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు.
ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని,
పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి
ఇలా సమయం కేటాయించి మరీ మహిళల
కోసం పాట విడుదల చేయడం విశేషమే
కదా.
ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించారు.

No comments:
Post a Comment