టోర్నీ ఆరంభం
నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్న ఇండియన్
ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్ సోమవారం ఆటగాళ్ల వేలం ప్రక్రియతో మొదలైంది.
తాజాగా లీగ్ పదోసీజన్ లోగోను మంగళవారం ఆవిష్కరించారు. తొమ్మిది లీగ్‌లను
విజయవంతంగా ముగించుకొని పదో సీజన్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నందున
లోగోలో పది సంఖ్యను అందంగా తీర్చిదిద్దారు. సంఖ్య మధ్యలో బ్యాట్స్‌మన్ షాట్
ఆడుతున్న భంగిమను ఏర్పాటు చేశారు. పక్కనే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో,
ఐపీఎల్ ఆంగ్ల అక్షరాలను డిజైన్ చేశారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని
ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభంకానుంది. మరోవైపు
దేశవ్యాప్తంగా 38 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్‌పార్క్‌ల ద్వారా స్టేడియంలో ఉన్న
అనుభూతిని అభిమానులకు కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు.