సెహ్వాగ్, పీటర్సన్ మెరుపులు
ఢిల్లీ ఇరగదీసింది! బౌలింగ్‌లోనా బ్యాటింగ్‌లోనా? ఈ రెంటితో పాటు అద్భుతమైన గ్రౌండ్ ఫీల్డింగ్‌తో! అవును.. నాలుగు రనౌట్లతో చెన్నైకి దిమ్మతిరిగేలా చేసింది. ఫలితం.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చెన్నై రనౌటైంది. నామమాత్ర లక్ష్యా న్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. మంగళవారం పూరి ఏకపక్షంగా జరిగన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సెహ్వాగ్ జట్టు.. ధోనీమెన్‌పై 8 వికెట్ల తేడా తో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ సెహ్వాగ్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐతే. అంతకుముందు మ్యాచ్‌లో వెట్టోరి తరహాలో వీరూ నిర్ణయం బెడిసికొట్టదు కదా! అనే సందేహాలకు ఢిల్లీ ఫీల్డర్లు తమ మెరుపు ఫీల్డింగ్‌తో తెరదించారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులకే పరిమితమైంది. మోర్నీ మోర్కెల్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. జట్టులో చేరిన బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ (26 బంతు ల్లో 43 నాటౌట్; 4x3, 6x2) మెరుపు బ్యాటింగ్‌తో అలరి స్తే, జయవర్దనే 20 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు సెహ్వాగ్ (21 బంతుల్లో 33; 4x4; 6x1)... నమన్ ఓఝా (14)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. అల్బీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోని తొలి మూడు బంతుల్ని ఓఝా బౌండ్రీకి తరలిస్తే, తర్వాత అతని ఓవర్లోనే సెహ్వాగ్ వరుసగా 4, 6 కొట్టి హల్‌చల్ చేశాడు. ఈ జంట తొలి వికెట్‌కు 8.2 రన్‌రేట్‌తో 32 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు ఔటయ్యాక జయవర్దనే-పీటర్సన్‌లు అబేధ్యమైన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. మోర్నీ మోర్కెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
చెన్నై ‘పరుగో పరుగు’!
దిగ్గజాల చేరిక ఢిల్లీకి ఉత్సాహాన్నిచ్చిందో ఏమోగానీ ఢిల్లీ జట్టు అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసింది. ఫలితంగా 4 రనౌట్లు! దీనికి తొలి బంతితోనే బీజంపడింది. సింగిల్ తీసే క్రమంలో డుప్లెసిస్ తడబాటు పాపం ఒక్క బంతి కూడా ఆడకుండానే విజయ్‌ని రనౌట్‌గా బలిగొంది. అంతేనా.. కొద్దిసేపటికే తనూ రనౌటయ్యాడు డుస్లిసిస్. ఫలితంగా 26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది చెన్నై. ఈ దశలో రైనా రెండు సిక్సర్లతో హల్‌చల్ చేసినా లేని సింగిల్‌కు కక్కుర్తిపడి యోగేశ్ నాగర్ వేసిన అద్భుతమైన త్రోకు అతనూ రనౌటయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిశాయో లేదో బద్రీనాథ్ కూడా రనౌట్‌గానే వెనుదిరగాల్సివచ్చింది. అప్పటికి చెన్నై స్కోరు 9.4 ఓవర్లలో 64. ఇక మ రుసటి ఓవర్లో దక్కన్‌పై పేలిన జడేజా (13) కూడా వెనుదిరగడంతో చెన్నై భారీస్కోరు ఆశలకు గండిపడింది. భారీ హిట్టింగ్‌తో అ లరిస్తాడనుకున్న ధోనీ 18 బం తులో 11 రన్స్ చేసి ఔటయ్యాడు.