ఐపీఎల్-4లో వెస్టిండీస్ ఓపెనరు బ్యాట్స్‌మెన్ గేల్ చోటు దక్కలేదు. ఇప్పుడు బెంగుళూరు తరఉపున అడే అవకాశం లభించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు గేల్ ఆఫ్‌స్పిన్‌తో కూడా సత్తా చాటగలడు. వేలంలో గేల్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించకపోవడం ఆశ్యర్యపరిచింది. ఇప్పుడు బెంగుళూరు ఆటగాడిలా అతడికి నిరూపించుకునే అవకాశం లభించింది.
Thursday, April 21, 2011
దాదా కథ ముగియలేదు ....
భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి ఐపీఎల్-4లో బరిలోకి దిగే ఆశలు చిగురించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఆటగాళ్ల వేలంలో తిరస్కరణకు గురైన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ కొచ్చి టస్కర్స్ కేరళ తరపున ఆడే అవకాశముంది. కొచ్చికి నాయకత్వం మహిస్తున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ మహేల జయవర్థనే వచ్చే నెల మొదటి వారంలో ఇంగ్లాండ్ పర్యటించే అవకాశముంది. దాంతో జయవర్థనే స్థానంలో గంగూలీని తీసుకోవాలని కొచ్చి ఫ్రాంచైజీ భావిస్తోంది.
Subscribe to:
Posts (Atom)