మహిళలందరితో కలిసి ఒకేసారి గోళ్లకు రంగు వేసుకొని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలు కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ఏకకాలంలో గోళ్లకు రంగు వేసుకున్నారు.
పోలాండ్‌కు చెందిన కాస్మోటిక్ బ్రాండ్ ఇంగ్లోట్‌తో కలిసి సోనాక్షి సిన్హా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమ అనంతరం గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని నిర్వాహకులు సోనాక్షికి అందజేశారు.