బాలీవుడ్
నటుడు సంజయ్ దత్ నటిస్తున్న ‘భూమి’ చిత్రంలో నటి అదితిరావు హైదరి ప్రధాన
పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంజయ్ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు.
ఇన్నాళ్లు ఈ పాత్రకు తగిన నటి కోసం అన్వేషించిన చిత్ర బృందం అదితిని ఎంపిక
చేసినట్లు బుధవారం తెలిపింది. ఒమంగ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న
ఈ చిత్రంలో తన పాత్ర కోసం అదితి సిద్ధమౌతున్నారట. ఫిబ్రవరిలో ‘భూమి’
షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.
అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.