Tuesday, November 24, 2015

అక్కడ ఆయనను ముద్దు పెట్టుకోవడం అవసరం!

-మధుశాలిని

‘‘ ‘చీకటి రాజ్యం’లో కమల్‌హాసన్ గారితో ముద్దు సీన్‌లో నటించా. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్ అనేది రొమాంటిక్ సీన్‌లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అక్కడ కమల్ గారిని ముద్దు పెట్టుకోవడం కథకు అవసరం. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఆ ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిసిస్తుంది’’ అని నటి మధుశాలిని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’లో మధుశాలిని కీలకపాత్ర పోషించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘ కమల్ హాసన్ గారంటే ఇష్టం. ఆయన సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వెంటనే ఓకే చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను త్వరలో తమిళ, మలయా ళాల్లో సినిమాలు చేయ నున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపారు.

పవన్‌కు జోడిగా మరో హీరోయిన్‌ ...

 పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ' సర్దార్‌ గర్బర్‌ సింగ్‌'లో మరో హీరోయిన్‌ నటిస్తుంది. ప్రస్తుతం కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఐటెం సాంగ్‌ కోసం ప్రత్యేకంగా లక్ష్మీరారు ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అలాగే ఒక ముఖ్య పాత్ర కోసం హీరోయిన్‌ సంజనను ఎంపిక చేయడం జరిగిందని సమాచారం. సంజన 'బుజ్జిగాడు ' చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించినా పెద్ద అవకాశాలు రాకపోవడంతో తమిళం, కన్నడంలో ఈమె నటించింది. అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా అనిపించుకోవడంలో విఫలం అయింది. ఈ సమయంలో అనుకోనుండా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో అవకాశం రావడం బఫర్‌ ఆఫ్పర్‌ వచ్చింది. అమెకు ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకం.