పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ కోచ్ అవతారం
ఎత్తనున్నాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు.
రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు.
ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు
ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్
సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్
ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు
ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం
చేశారు.
పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు.
పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే
పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు
తిరస్కరించాడు.
Wednesday, November 4, 2015
నిజమైన పెళ్లిలా అనిపించింది !
ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్
ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి
కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్
ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో
స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె
కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి
కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’
సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి
పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె
కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి
కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’
సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి
పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)