పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా ' ది బిజినెస్ మేన్ ' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ హిట్ అయిన ' దూకుడు' తర్వాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా కావడంతో ' ది బిజినెస్ మేన్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా వుంటే, ' ది బిజినెస్ మేన్ ' సినిమా కోసం మాస్ మసాలా ఐటమ్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఇందు కోసం ముంబై నుంచి శ్వేతా భరద్వాజ్ అనే సెక్సీ భామని టాలీవుడ్‌కి ఇంపోర్డ్ చేస్తున్నారు.
ఇక, ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్ జరుపుకుంటోన్న ' ది బిజినెస్ మేన్ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరగనుందట.