తొలి చిత్రం ' లీడర్'లో పద్దతిగా కన్పించిన రిచా గంగోపాధ్యారు, ' మిరపకారు' సినిమాకొచ్చేసరికి చాలా ఘూటుగా కన్పిస్తోంది.' మిరపకారు ' సినిమాతో తన గ్లామర్ ఘాటు ఏంటో చూపిస్తానంటోన్న రిచా వెంట టాలీవుడ్ దర్శక నిర్మాతక ఇప్పుడు క్యూ కడ్తున్నారట.నిన్న జరిగిన ' మిరపకాయ' సినిమా ఆడియో విడుదల వేడుకలో అందరి కళ్ళూ రిచాపైనే పడ్డాయంటే ఆమె ఎంత గ్లామర్‌ని వెద జల్లిందో అర్ధం చేసుకోవచ్చు. రేంజ్‌ని ఎంతవరకు పెంచుతుందోగానీ, ' మిరపకారు' సినిమాపై మాత్రం టాలీవుడ్‌లో అంచనాలు బాగానే వున్నాయి.
Monday, December 6, 2010
భూవివాదంలో అనుష్క
అందాల అనుష్క నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా మన సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా వుంటుంది. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొంది.రెండేళ్ల క్రితం వైజాగ్ లో కొందరు సినీప్రముఖులతో కలిసి అనుష్క కూడా విశాఖ జిల్లా భీమిలిలో కొంత భూమి కొనుగోలు చేసింది.అయితే ఆ స్థలం తనదేనని తనకి తెలియకుండా ఎవరో అక్రమంగా అనుష్కకి అమ్మేశాడని ఓ ఎన్నారై కోర్టు కెక్కాడు. ఈ కేసు విషయమై కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అనుష్క వాటిని పట్టించుకోలేదు.దీంతో ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి జనవరి 28 న అనుష్క వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరి దీనిని ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి! తరలిపోతున్న టాలీవుడ్..
Subscribe to:
Posts (Atom)