బంగ్లాదేశ్ క్రికెట్ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జటైన దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్‌ను గెలిచి వరుసగా మూడో సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుది. పాకిస్తాన్, భారత్‌లపై వన్డే సిరీస్‌లను గెలిచిన బంగ్లా తాజాగా మరో సిరిస్‌ని సొంతం చేసుకుది. దక్షిణాఫ్రికాపై 2-1తేడాతో గెలిచింది. దీంతో బంగ్లాదేశ్ హ్యాట్రిక్ సిరీస్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. సౌమ్య సర్కార్ ( 90) పరుగులు చేశాడు. తమీమ్ ఇక్బాల్ 61 పరుగులు నాటౌట్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. మ్యాచ్ వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 168 పరుగులు చేయగా బంగ్లాదేశ్ మాత్రం ఒక వికెటు కొల్పోయి విజయం సాధించింది. బంగ్లాదేశ్ పూల్ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్ జట్టు విజయనందంలో చిదులువేస్తున్నారు. చిన్న జట్నైనా విజయాలు దీటుగా వస్తున్నాయి.