Tuesday, October 5, 2010
తొలి టెస్టులో భారత్ ఘన విజయం
హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి సత్తా చూపాడు. ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కొని ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. వెన్నునొప్పి భాదిస్తున్నా రన్నర్ సాయంతో బరిలోకి దిగి బట్టును విజయతీరాలకు చేర్చాడు. 73 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 76 పరుగుల వద్ద జహీర్‌ఖాన్ అవుట్ అయ్యాడు. అ తరువాత బరిలోకి దిగిన వివిఎస్ లక్ష్మణ్ 73 పరుగుల చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. భజ్జీ 2, ఇషాంత్ శర్మ 31 పరుగులు చేశారు. చివరిలో లక్ష్మణ్ 73, ఓజా 5 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 తో భారత్ ముందంజలో ఉంది.
Subscribe to:
Posts (Atom)