కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి
ఇంట వైభవంగా నిర్వహించిన కుమార్తె
వివాహంపై ఆదాయ పన్ను శాఖ దాడులు
నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ నటి
రకుల్‌ప్రీత్ సింగ్ డ్యాన్స్
చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను
శాఖ అధికారులు రకుల్‌ప్రీత్
ఇంటిపై కూడా దాడి చేశారని ఇటీవల
వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో
నిజంలేదని రకుల్ తాజా ఇంటర్వ్యూలో
చెబుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘జనాలు ఈ విషయాన్ని ఎందుకు వదిలేయరో నాకు తెలియడం లేదు. తొలుత నేను డ్యాన్స్ చేయడానికి ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చేశారు. ఇలా చేయడం చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఈ పుకార్లతో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఎవరూ నిజానిజాలను పరిశీలించడం లేదు, కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నాజీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను’ అని రకుల్ అన్నారు.