జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్
హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని
వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు
ఎప్పుడూ అలా చేయడని అన్నాడు.
తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు
వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు.
దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు.
తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన
పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని
విజ్ఞప్తి చేశాడు.
తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు.
ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో
ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు
అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్ కు మరోసారి ప్రత్యేక కానుక
అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్ కు
పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న
నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్
చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్ లో
పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు.
పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా
మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు
అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్..
నితిన్ కు మామిడి పళ్లను పంపాడు.
బాలీవుడ్ నటి దీపిక పదుకొణె
రహస్యంగా తన ప్రియుడు రణ్‌వీర్
సింగ్‌ని కలిసిందట. దీపిక హాలీవుడ్‌లోనటిస్తున్న
ట్రిపులెక్స్-ది రిటర్న్
ఆఫ్ ది జాండర్ కేజ్ చిత్ర
షూటింగ్ ఇటీవల పూర్తయింది.
మరో పక్క రణ్‌వీర్ బేఫికర్
చిత్ర షూటింగ్ కోసంపారిస్‌లో
ఉన్నాడు. ఎలాగూ షూటింగ్ పూర్తయింది
కదా అని దీపిక వారం క్రితం రణ్‌వీర్
కోసం పారిస్ వెళ్లిందట.
కానీ
అక్కడ దీపికకి నిరాశే ఎదురైంది.
దీపిక తన పారిస్ ట్రిప్‌ని
సీక్రెట్‌గా ఉంచాలనుకుంది.
కానీ కొందరు అభిమానులు దీపికను
గుర్తుపట్టి ఫొటోలు తీయబోతుంటే
ఎవరూ దీపిక ఫొటోలు తీయడానికి
వీల్లేదంటూ చిత్రబృందం హెచ్చరించినట్లు
తెలుస్తోంది.
దీంతో
దీపిక బేఫికర్ సెట్స్‌లో కాసేపు
సరదాగా ఎంజాయ్ చేసిందే కానీ
రణ్‌వీర్‌ని మాత్రం పర్సనల్‌గా
కలవలేకపోయిందట. ‘దీపిక పని విషయంలో
చాలా ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌తో
ఉంటుంది. అదీ కాకుండా షూటింగ్
కోసం అటు రణ్‌వీర్ పారిస్‌లో,
ఇటు దీపిక టొరంటోలో ఉన్నారు.
కొన్ని నెలలుగా ఇద్దరూ కలుసుకోలేదు.
ఎంత స్టార్ అయినా దీపిక కూడా
ఓ ప్రేమలో ఉన్న ఆడపిల్లే. ఇంటికి
వెళ్లే ముందు ఓసారి ప్రియుడిని
కలవాలనుకోవడంలో తప్పేముంది’
అంటూ సినీ వర్గాలు దీపికకే మద్దతు
ఇస్తున్నాయి.