పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్,...,మురుగదాస్! చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహించే జాబితాలోని పేర్లివి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..కచ్ఛితంగా 150వ సినిమా పూర్తిచేయాలని.. సాక్షాత్తూ బిగ్‌బి అమితాబ్ స్వయంగా కోరిన నేపథ్యంలో చిరు ‘సరే’నని మాట ఇచ్చారు. అది నిలబెట్టుకుంటూ..ఎట్టకేలకు మురుగదాస్ వినిపించే కథ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఫిలినగర్‌లో చర్చ సాగుతోంది. గజని, సెవెన్త్‌సెన్స్ -వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన మురుగ..అదే స్థాయి కథ కోసం మరోసారి కసరత్తు చేస్తున్నారని, ఈ మెగాప్రాజెక్టును తనదైన బాధ్యతతో పూర్తి చేయాలని భావిస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి.