బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా
విజృంభించాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే
చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్
అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. నటుడు
అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో
ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఈ చిత్రంలో ఆదా
శర్మ, అడివి శేష్ కూడా నటించారు. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది.
షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Thursday, January 21, 2016
బాహుబలికి వధువు కోసం భల్లాల ప్రకటన!
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు 'బాహుబలి' ప్రభాస్. ఈ
ఏడాది పెళ్లి చేసుకుంటానని పెదనాన్న కృష్ణంరాజుకు ఈ ఛోటా రెబల్ స్టార్
హామీ కూడా ఇచ్చాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అన్ని విధాల తగిన వధువు కోసం
అన్వేషణ కూడా మొదలుపెట్టారు. 'బాహుబలి-2' షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రభాస్
పెళ్లిపీటలు ఎక్కుతాడని తెలుస్తోంది.
మరోవైపు 'భల్లాలదేవ' రాణా కూడా తనవంతుగా 'బాహుబలి'కి వధువును వెతికే పని పెట్టుకున్నాడు. ఓపక్క 'బాహుబలి' ప్రభాస్ గుణగణాలు వివరిస్తూనే.. మరోపక్క ఈ 'బాహుబలి'కి తగిన అవంతిక (అంటే వధువు) ఎలా ఉండాలో కొంత సరదాగా, కొంత వ్యంగ్యంగా వివరిస్తూ 'పెళ్లి ప్రకటన'ను ట్విట్టర్‌లో జారీ చేశాడు. ఊహించినట్టే 'బాహుబలి' వధువు కోసం భల్లాల ఇచ్చిన ఈ ప్రకటన ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. రాణా పెట్టిన ఆ ప్రకటన ఇది..
బహుబలి కోసం వధువు కావాలెను!
ఇక వధువు విషయానికొస్తే

- వరుడు 36 ఏళ్ల యుద్ధయోధుడు, సంచార తెగకు చెందిన సైనిక నాయకుడు..
- 6.2 అడుగుల ఎత్తుతో మాంఛీ బలిష్టంగా ఉండి ఇంట్లో పనులకు బాగా ఉపయోగపడతాడు..
- తనతో పెళ్లికి సరిపోయే అమ్మాయి కనిపిస్తే చాలు కొండలు, గుట్టలు ఎక్కుతాడు. కానీ అమ్మాయిల వెంటపడే ఆకతాయి కాదు.
- మేకప్ బాగావేస్తాడు. వధువుకు కూడా బాగా మేకప్ చేయగలడు
ఇక వధువు విషయానికొస్తే
- అమ్మాయి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండాలి.
- ఎంతగా అంటే.. ఆమె కోసం అడవులు, కొండలు, కొండచరియలు సైతం గాలించగలగాలి
- కత్తియుద్ధం, విలువిద్యతోపాటు ముఖాముఖి మల్లయుద్ధం సైతం తెలిసి ఉండాలి
- ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తను గౌరవించేదై ఉండాలి
-
ఇంటిపనుల్లోనే కాదు సైనిక వ్యూహాల్లో, శత్రువును చిత్తుచేసే ఎత్తుల్లో కూడా భర్తకు సాయం చేయగలగాలి.
Subscribe to:
Posts (Atom)