Monday, February 28, 2011

వెంకటేష్‌తో ' సావిత్రి '

 వెంకటేష్‌ హీరోగా ..... తేజ దర్శకత్వంలో ' సావిత్రి' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. గతంలో లక్ష్మీ, తులసీ, మల్లీశ్వరి, నాగవల్లి వంటి టైటిల్స్‌తో సినిమాలు చేసిన వెంకీ... ఈసారి మాత్రం ' సావిత్రి' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్‌, తేజ కాంభినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగినట్లుగా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.