అందాల హీరోయిన్ సమంతా రూత్ ప్రభు చీపురు
పట్టి చెత్త ఊడ్చింది. హీరో రామ్ ఆమెను స్వచ్చ భారత్ కార్యక్రమానికి
నామినేట్ చేయడంతో ఆమె ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఓ
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, పరిసరాల్లో చీపురు పట్టుకుని ఊడ్చిన సమంత ఆ
ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. స్వచ్చ భారత్‌లో భాగంగా
సమంత తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో
విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయి ఆమె చుట్టూ
చేరారు. ట్విట్టర్లో ఈ ఫోటోలు షేర్ చేసిన సమంత స్వచ్చ భారత్ కార్యక్రమంలో
పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొంది. పారిశుద్ద్య
కార్మికులతో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. అలాగే ప్రతి ఒక్కరూ
ఎవరికి సంబంధించిన చెత్త వారే శుభ్రం చేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చింది.