Wednesday, September 18, 2013

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానిక తరలింపు


ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనంలో యువతి, యువకులతో పాటు పెద్దలు తరలివచ్చారు. ఖైరతాబాద్‌ వినాయకుడు దగ్గర జనం విచల విడిగా ఉన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడు ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నాడు. ఇందుకు కనీసం 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. నగరంలో అత్యంత పెద్దదైన ఖైరతాబాద్‌ గణనాధున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు. నగరంలో మొదట బాలాపూర్‌ వినాయకుడి తరలింపుతో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సాగర్‌ తీరానికి తరలిస్తారు. అలాగే రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది బొజ్జ గణపయ్యలు వివిధ రూపాలతో భక్తులకు కనువిందు చేస్తూ ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, సఫిల్‌గూడ ... తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనానికి వినాయకుని విగ్రహాలు తరలివస్తున్నాయి. కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి 500 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాళ మరో 700 విగ్రహాల వరకు ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం అయ్యే అవకాశంముంది. దీనికోసం పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లక్షలు పలికిన లంబోదరుడి లడ్డూ ప్రసాదాలుఅమీర్‌పేట లడ్డూ రూ. 12,01,116
బాలాపూర్‌ లడ్డూ రూ. 9.26 లక్షలు

హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గణేష్‌ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వినాయకుడి పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలను వేలం వేశారు. అమీర్‌పేటలో వినాయకుని లడ్డూ ఈ సారి రికార్డు ధర పలకడం విశేషం. 12 లక్షల వెయ్యినూట పదహారు రూపాయాలకు ఈ లడ్డూను వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థ సీఈవో బీఎస్‌ఎస్‌ మూర్తి కైవసం చేసుకున్నాడు. అలాగే బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ మాజీ మేయర్‌, తెదేపా నేత, టీకేఆర్‌ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అత్తాపూర్‌ వినాయకుడు లడ్డూది. 3.25 లక్షలు పలికింది. 

నిమజ్జనం సందర్శకులకు అల్పాహారాలు పంపిణీలు
గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం సందర్శించడానికి తరలివచ్చే భక్తులకు, మండపాల నిర్వాహకులకు పలు స్వచ్చంద సంస్థలు ఉచిత అల్పాహార శిబిరాలను ఏర్పాటు చేశాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లతో పాటు దారిపోడవునా అల్పాహారం పొట్లాలను, ప్రసాదాలను అందజేస్తున్నారు.


జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలితో పాలు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాయి.