మహేష్‌బాబు నటించిన చిత్రం ' శ్రీమంతుడు రేపు విడుదలకు సిద్దం కానున్నది. ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఊరికి ఎంతో కొంత సేవా చేయాలనే స్ఫూర్తివంతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. మునుపెన్నడూ లేని విధంగా మహేష్‌బాబును సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రేక్షకులు ఓ అర్థవంతమైన చిత్రాన్ని చూశామని సంతృప్తిచెందేలా వుంటుంది అన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి.
సైకిల్‌పై శ్రీమంతుడా ... తనయుడా ? ఈ చిత్రంలో మహేష్ బాబు సైకిల్ మీద ఉన్న టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ ఫోటొను మార్పింగ్ చేసి మహేష్ ఫోటొ స్థానంలో ఆయన కుమారుడు గౌతమ్ ఫొటోను పెట్టారు. ఈ పొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాల్‌చల్ చేస్తోంది.