ఈ వీకెండ్ సమంతకి ఎప్పటికీ గుర్తుండే మెమరబుల్ మూమెంట్ అనే చెప్పాలి.
చల్లగాలిలో చెలికాడితో కలసి షికారుకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్ని
‘నేను, అతను మరియు ఆమె’ అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక్కడ
‘నేను’ అంటే సమంత. ‘అతడు’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ...
సమంత ప్రేమికుడు అక్కినేని నాగచైతన్యే! మరి, ‘ఆమె’ ఎవరు? అనుకుంటున్నారా!
సూపర్‌ఫాస్ట్ స్పోర్ట్స్ కార్. నాగచైతన్యకి బైక్స్ అండ్ కార్స్ అంటే
చాలా ఇష్టం.
వీలు చిక్కినప్పుడు... కారులో షికారుకి వెళ్లడం చైతూకి అలవాటు. అంతకు
ముందు సోలోగా రేసింగ్ కారులో రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు
ప్రేమలో ఉన్నారు కదా! ప్రేయసి, త్వరలో కాబోయే శ్రీమతి సమంతతో కలసి శనివారం
ఢిల్లీ శివార్లలోని రేసింగ్ సర్క్యూట్‌లో ఎంజాయ్ చేశారు. ఆ హ్యాపీ
మూడ్‌లో ‘మా శ్రీమతి తీసిన ఫొటోలు’ అని నాగచైతన్య సోషల్ మీడియాలో
పేర్కొన్నారు. ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి చేసుకుని ఒకే గూటిలో ఉండే సమయం
దగ్గర్లోనే ఉంది.