ఇండియాన్ క్రికెటర్ హర్బజన్
సింగ్, బాలీవుడ్ నటి గీతాబస్రాల పెళ్లి తేదీ ఖరారైంది. అవుననే
అంటున్నాయి. మీడియా వర్గాలు వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైన సంగతి అందరికీ
తెలిసిందే. అయితే అక్టోబర్ 29న వీరు పంజాబ్‌లో పెళ్లి చేసుకుంటున్నట్లు
సమాచారం. మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుందట. నవంబర్ 1వ తేదీన
దిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం గీతా
లండన్‌లో ఉంది. ముంబయిలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను
డిజైన్ చేసి అక్కడికే పంపిస్తున్నారట. హర్భజన్‌కి కూడా అక్టోబర్ 25 నుంచి
నంబర్ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు
ఖారారు చేసినట్లు సమాచారం.