80వ దశకంలో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన అగ్ర తారలందరూ శనివారం చెన్నైలోని ఓ అతిథి గృహంలో కలుసుకున్నారు. అప్పటి మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. అందరూ ఎరుపురంగు వస్ర్తాల్ని ధరించి సందడి చేశారు. ఈ తారా సమ్మేళనంలో చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేష్, ప్రభు, సత్యరాజ్, సుమన్, నరేష్, రాధా, సుహాసిని, శోభన, సుమలత, జయసుధ, రమ్యకృష్ణ, రేవతి, ఖుష్భూ, లిజీ, సరిత, భాగ్యరాజా, రఘు, భానుచందర్, జాకీష్రాష్ తదితరులు పాల్గొన్నారు. 80వ దశకం నాటి తారలందరూ కలిసి ఆరేళ్ల కిత్రం మొదలుపెట్టిన ఈ పునః కలయిక సంప్రదాయాన్ని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పాటిస్తుండటం విశేషం