విక్రమ్ కథానాయకుడిగా శంకర్
దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్
నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్
ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు
అందిస్తున్నారు. దక్షిణ భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో
తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని
ఆకర్షిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్‌మీడియాలో
విశేష ఆదరణ లభించింది. మనిషి, మృగరూపం సమ్మిళితంగా వున్న విక్రమ్ ఆహార్యం
సర్వత్రా చర్చనీయాంశమయింది. హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో ప్రచార
చిత్రం వుందని జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి.
భారతీయ చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో విక్రమ్ పాత్ర చిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగుతుందని తెలుస్తోంది. థ్రిల్, ఫాంటసీ మేళవించిన ఈ చిత్రంలో సమకాలీన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అంతర్లీనంగా చర్చించారని చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివిధ భాషా హక్కులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయినట్లు చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.