200 గ్రాముల కొకైన్ స్వాధీనం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి స్నేహితులతో వెళ్తున్న ప్రముఖ నటి జీవిత సోదరుడు, నిర్మాత మురళితోపాటు అతని ఇద్దరి స్నేహితులను పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీమ్ శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి నుంచి 200 గ్రాముల కొకైన్, కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మురళి గతంలో మగాడు, శేషు చిత్రాలు నిర్మించాడు. ఆశించిన స్థాయిలో రెండు సినిమాలూ ఆడలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆయన తన స్నేహితులైన రాంబాబు, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి కుమారుడు న్యాస్‌తో కలిసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ నైజీరియన్ నుండి 200 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఎపి 28 డిఎ 3540 కారులో వెళ్తుండగా పశ్చిమ మండలం డిసిపి స్పెషల్ టీముకు సమాచారమందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మురళి కారును ఆపి సోదా చేయగా కొకైన్ లభించింది. వారిని వెంటనే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లలో ఉన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. వారికి కొకైన్ అమ్మిన నైజీరియన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.