హీరో గోపీచంద్ తన స్టైల్ చేంజ్ చేశారు. ఆల్రెడీ ‘లౌక్యం’, ‘జిల్’
సినిమాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో
నటిస్తున్న యాక్షన్ సినిమాలో క్లాసీ లుక్‌లో గోపీచంద్ సరికొత్తగా
కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై
జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్
పూర్తయింది. నెల రోజుల పాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను
తెరకెక్కించారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్, ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ప్రీ-క్లైమాక్స్ సీన్ అద్భుతంగా వచ్చాయి. గోపీచంద్, హీరోయిన్ క్యాథరిన్ సహా సుమారు 70మంది నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్‌గా తీస్తున్నారు’’ అన్నారు. ముఖేశ్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.థమన్.