Saturday, November 14, 2015

' జబర్ధస్త్‌' యాంకర్‌గా చేయనున్న శ్యామల


తెలుగు బుల్లి తెరపై సంచల కార్యక్రంగా దూసుకు పోతుంది. ' జబర్దస్త్‌'. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ కామెడీ కార్యక్రమానికి నాగబాబు మరియు రోజా న్యాయ నిర్ణేతలు. ఇక ఈ కార్యక్రమంకు మొదట హాట్‌ యాంకర్‌ అనసూయ యాంకరింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రష్మి యాంకర్‌గా చేస్తోంది. గత కొంత కాలంగా రష్మికి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. దాంతో రష్మి కూడా జబర్ధస్త్‌ నుండి దూరంగా వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ స్థానంలో శ్యామల రాబోతున్నట్లుగా ఈటీవీ వర్గాల నుండి సమాచారం. గత కొంత కాలంగా పలు ఆడియో ఫంక్షన్స్‌తో పాటు బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుది శ్యామల. ఈమెను జబర్దస్త్‌ యాంకర్‌గా ఎంపిక చేయాలని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి తర్వలోనే జబర్దస్ల్‌ వేదికపై శ్యామలను చూపిస్తామేమో చూడాలి.