ఇలియానా నృత్యం చేస్తుండగా ప్రమాదానికి గురయింది. చెన్నైలో తమిళ చిత్రం నన్బస్ ( త్రీ ఇడియట్స్ రీమేకి ) కి సంబంధించిన పాట కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ అధ్వరంలో ఇలియానా ప్రాక్టీస్ చేస్తోంది. ఓ భంగిమ కోసం ప్రయత్నిస్తుండగా ఆమె అదుపుతప్పి పడిపోయింది. చీలిమండ భాగంలో గాయమైంది. ఇలియానాకు రెండు, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అన్ని డాక్టర్ తెలిపారు.