త్రిష హీరోయిన్‌గా వచ్చి 13 ఏళ్లయింది. ఈ తమిళ పొణ్ణు తెలుగులో
టాప్‌స్టార్‌గా ఎదిగింది. అగ్ర హీరోలు చిరంజీవి నుంచి మహేశ్‌బాబు వరకూ
అందరితోనూ నటించిన ఈ భామ ఇప్పటి దాకా తెర మీద తెలుగులో గొంతు విప్పలేదు.
బయట కూడా పొడి పొడి తెలుగే వచ్చు.
ఇప్పటివరకూ డబ్బింగ్ చెప్పని త్రిష ఏకంగా పాటే పాడేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, ఎం. పద్మజ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న నాయకి కోసం రెండు భాషల్లోనూ త్రిష పాడడం విశేషం. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో త్రిష ఈ పాట రికార్డింగ్ పూర్తిచేశారు.

No comments:
Post a Comment