వరుసగా విజయాలతో మంచి ఉత్సహంతో ఉన్న జట్టు ఒక్క సారిగా తుస్స్ మాని గాలి పోయింది. ఆస్ట్రేలియా జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసింది. ప్రపంచకపలో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 176 పరుగులకు అలౌట్ అయ్యింది. హడ్డిన్ 44 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 41 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.