దొరికిన పాత్రలతోనే చాలామంది సంతృప్తిపడిపోతారు. కానీ దానికి మించి ఏదో చేయాలని ఇంకొంతమంది చూస్తుంటారు. నా దారి మాత్రం దానికి భిన్నమ’’ంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నుంచీ ఆమె కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగంతోనే దూసుకుపోతోంది. ఎప్పుడూ తన చేతిలో నాలుగు సినిమాలైనా ఉండేట్టు చూసుకొంటోంది రకుల్. అటు మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లాంటి స్టార్ కథానాయకులతో నటిస్తూనే ఇటు... యువతరం కథానాయకులతోనూ జోడీ కడుతోంది. ఓ పాత్రని ఎంచుకొనేటప్పుడు మీ ఆలోచనలెలా ఉంటాయి? అని అడిగితే ‘‘కెరీర్ కొత్తలో నాకొచ్చిన పాత్రల్నే చేసేదాన్ని. అప్పుడు మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు రొటీన్ పాత్రలే వస్తున్నా.. అందులోనూ నా మార్క్ ఎలా చూపించాలని ఆలోచిస్తున్నా. నాకోసం కొత్త పాత్రలు సృష్టించండి అని చెప్పే ధైర్యం చేయలేను. ఎందుకంటే ప్రయోగాలు ఎల్లవేళలా విజయాన్ని అందివ్వకపోవొచ్చు. నాలో నటిని సంతృప్తి పరచుకోవడానికి సినిమాలతో ప్రయోగాలు చేసే సాహసాలు చేయను’’అని చెప్పింది రకుల్