Sunday, December 26, 2010
మళ్లీ అదే కథ : భారత్ 183/6
డర్బన్ : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకున్నది. తొలి రోజు భారత్ 183/6 పరుగులు చేసింది. హర్భజన్ సింగ్ 15, దోనీ 20 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. గంభీర్ స్థానంలో వచ్చిన మురళీ విజరుతో సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రారంభించారు. సెహ్వాగ్ 25, విజరు 19, ద్రవిడ్ 25, సచిన్ 13, లక్ష్మణ్ 38, పుజరా 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. రైనా స్థానంలో పుజరా అలాగే గంభీర్ స్థానంలో మురళీ విజరు జట్టులో ఉన్నారు. ఇద్దరు 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయాన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.
బాలయ్యతో రవితేజ కుస్తీ
బాలయ్యతో, రవితేజ మళ్ళీ ఢ ఇంతక ముందు ఇద్దరు ఒక్కేసారి సినిమా విడుదల అయ్యాయి. ' ఒక్కమగాడు'తో బాలయ్య 'కృష్ణ' తో రవితేజ బరిలోకిగారు. ఇద్దరు కుస్తీ పడి చివరికి రవితేజ, సినిమా హిట్ కొట్టి బాలయ్యను ఓడించాడు. ఈ సారి బాలకృష్ణ సినిమా 'పరమవీరచక్ర' సంక్రాతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే అదే సమయంలో రవితేజ సినిమా ' మిరపకాయ' కూడా సంక్రాతికే బరిలోకి దిగనుంది. మరి ఈ సారి ఆసీన్ రివర్స్ అవుతుందో మళ్లీ రిపీట్ అవుతుందో జనవరి 15 వరకు వేచి చూడాలి.
సుమంత్ - స్వాతి కాంబినేషన్‌లో ' గోల్కొండ హైస్కూల్ '
సుమంత్ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ' గోల్కొండ హైస్కూల్ ' చిత్రం సంక్రాంతి బరిలోకి దూకనుంది. గత కొంత కాలంగా విజయాలు లేక సుమంత్ కష్టాల్లో ఉన్నాడు. 'బోణి ' తర్వాత కావాలని బ్రేక్ తీసుకున్నాడు. ఆష్టాచమ్మా వంటి హిట్ ఇచ్చిన మోహనకృష్ణ - స్వాతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ' గొల్కొండ హైస్కూల్ ' పై సుమంత్‌కి భారీ అంచనాలే ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)