వెంకటేష్, మహేష్‌బాబుల సంచలన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. అయితే గత కొంతకాలంగా వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ విషయమై సందిగ్థం నెలకొంది. త్రిష, భూమిక, అమలాపాల్ లాంటి హీరోయిన్ల పేర్లు ఆ మధ్య వినిపించాయి. తీరా విషయానికి వస్తే అవన్నీ ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు అనూహ్యంగా అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి అచ్చంగా తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ అచ్చతెలుగు అందాల అపరంజి బొమ్మను వెంకటేష్ పక్కన నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్ సరసన అయితే ఓకేగానీ హీరోయిన్లంతా ప్రిన్స్ మహేష్‌బాబుకు ఒదిన పాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు అంజలి కూడా అవకాశం ఉపయోగించుకుంటుందో లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా వదులుకుంటుందో మరి వేచిచూడాలి.