Friday, January 28, 2011

కాంట్రాక్టుల వర్షం ..

 భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ మైదానంలో ప్రవేశిస్తే పరుగుల వర్షం. కాంట్రాక్టులకు సుమఖత చూపితే కనకవర్షం. ఈ ఏడాది తొలి 27 రోజుల్లోనే సచిన్‌ టెండ్కూలర్‌కు అతడి ఆదాయం ఎంతో తెలుసా ! కోటిన్నర రూపాయలు. అతడు తాజాగా రు. 40 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో రాణించి భారత్‌కు ప్రపంచకప్‌ అందిస్తే మరిన్ని కాంట్రాక్టులు అతడికి దక్కనున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ాక కోకాకోలా సంస్థ సచిన్‌తో మూడేళ్ల కాంట్రాక్టు కుదర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రు. 20 కోట్లు. రు. 250 కోట్లతో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన అమిత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సచిన్‌కు రెండు ఆధునాతన విల్లాలను కూడా కానుకగా సమర్పించుకుంది. వీటి విలువ ఒక్కొక్కటి రెండున్నర కోట్ల రూపాయాలు. సచిన్‌ ాప్పటికే 17 కంపెనీల ఉత్పతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.

ప్రపంచకప్‌ కీలకమైన జట్లు ఇవే

  శ్రీలంక జట్టు : కుమార్‌ సంగక్కర , జయవర్ధన్‌, దిల్షాన్‌, మురళీ ధరన్‌, మథ్యస్‌, తరంగా, సమరావీరా , స్లిల్వా, కపుదెగేరా, పెరార్‌ , కులాశేఖరా, మలింగా, మెండిస్‌, హీరాత్‌ , పెరోనార్‌.

 వెస్టిండీస్‌ జట్టు : డారెన్‌ సమ్మీ ( కెప్టెన్‌ ), క్రిస్‌ గేల్‌, బ్రావో, డారెన్‌ బ్రావో,  పొలార్డ్‌, రామ్‌నరేష్‌ శర్వాన్‌, డెవోన్‌ స్మిత్‌, సులైమాన్‌ బెన్‌, నిఖితా మిల్లర్‌, బాగ్‌ ( వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రస్సెల్‌, రవి రాంపాల్‌, కేమర్‌ రోచ్‌, చందర్‌ పాల్‌ , ఆండ్రియన్‌ భరత్‌.
 న్యూజిలండ్‌ జట్టు : వెటోరి ( కెప్టెన్‌ ), బెన్నెట్‌, జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌, గుప్టిల్‌, జేమీ హౌ, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, నాథన్‌ మెక్‌కల్లమ్‌, కైల్‌ మిల్స్‌, జాకబ్‌ ఓరమ్‌, జెస్సీ రైడర్‌, టిమ్‌ సౌతీ, స్లైరిస్‌, రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌, ల్యూక్‌ వుడ్‌కాక్‌.
 
 దక్షిణాఫ్రికా జట్టు : గ్రేమ్‌ స్మిత్‌ ( కెప్టెన్‌ ), ఆమ్లా, బోథా, డివిలియర్స్‌, డుమిని, డు ఫ్లెసిన్‌, ఇంగ్రామ్‌, కలిస్‌, మోర్నీ మోర్కెల్‌, వేనీ పార్నెల్‌, పీటర్సన్‌, స్టెయిన్‌, తాహిర్‌, సోట్‌సొబ్‌, వాన్‌విక్‌.


 భారత్‌ జట్టు : మహేంద్రసింగ్‌ ధోనీ ( కెప్టెన్‌ ) వీరేంద్ర సెహ్వాగ్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), సచిన్‌ టెండ్కూలర్‌, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, యుసుఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌, ఆశ్విన్‌, పీయూష్‌ చావ్లా
ఆస్ట్రేలియా జట్టు : రిక్‌ పాటింగ్‌ ( కెప్టెన్‌ ) మైఖెల్‌ క్లార్క్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), బొల్లింగర్‌, బ్రాడ్‌ హ్యాడీస్‌, జాన్‌ హేస్టింగ్స్‌, నాథన్‌ హర్టీజ్‌, డేవిడ్‌ హస్సీ, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌లీ, టిమ్‌ ఫెయిన్‌, స్ట్రీవ్‌ స్మిత్‌, షాన్‌ టెయిట్‌, షేన్‌ వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌.
 
 పాక్‌స్థాన్‌ జట్టు : షాషిద్‌ ఆఫ్రీదీ, మిస్బాఉల్‌హక్‌, మహ్మద్‌ హఫీజ్‌, కమ్రాన్‌ అక్మల్‌ ( వికెట్‌ కీపర్‌), యూనిస్‌ ఖాన్‌, అషద్‌ షఫీక్‌, ఉమర్‌ అక్మల్‌, అబ్దుల్‌ రజాక్‌, అబ్దుర్‌ రెహమాన్‌, సయ్యద్‌ అజ్మల్‌, పోయబ్‌ అక్తర్‌, ఉమర్‌గుల్‌, వహబ్‌ రీయాజ్‌, సోహాయిల్‌ తన్వీర్‌, అహ్మద్‌ షెహజాద్‌.
ఇంగ్లండ్‌ జట్టు : ఆండ్రూ స్ట్రాస్‌ ( కెప్టెన్‌ ), అండర్సన్‌, ఇయాన్‌ బెల్‌, టిమ్‌ బ్రెన్నన్‌, స్టువర్డ్‌ బ్రాడ్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పీటర్సన్‌, ప్రయార్‌, అజ్మల్‌ షెహజాద్‌, గ్రేమ్‌ స్వాన్‌, ట్రెడ్‌వెల్‌, ట్రాట్‌, రైట్‌, యార్డీ.

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది

తెలగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం. కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా.ఇటీవల   అక్కినేని నాగార్జునతో ' రగడ ' చిత్రంలో రొమాన్స్‌ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ' అష్టలక్ష్మీ ' పాత్ర తనకెంతో పేరు తెచ్చి పెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.ఇదే   విషయం గురించి ఆమె మాట్లాడుతూ '' నాగ్‌తో పుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ' రగడ'తో తీరింది. ఆయనతో నాటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ' రగడ' చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ' రాజ్‌' చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్‌ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ాద్దరు హీరోలతో నటించాను.ఇక బ్యాలెన్స్‌గా వున్న ' నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది. '' అంటూ ముసిముసిగా నవ్యుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరుఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు. అప్పుడు మీ మధ్య కాంపిటీషన్‌ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ' ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది.