చిరంజీవి
150వ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తరవాతి చిత్రాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడు
మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది. ఈ రెండు ప్రశ్నలకు ఒకేసారి సమాధానం
దొరికిందిప్పుడు. చిరంజీవి - వినాయక్‌ల ‘కత్తి’ రీమేక్‌కి ఈనెల 29న
లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.
అదే రోజున పవన్ కల్యాణ్ - ఎస్.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట.
29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని
లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెల
చివరి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్ - సూర్యల
చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్, ఇటు ఎస్.జె
సూర్య స్క్రిప్ట్‌పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ
ప్రసాద్, పవన్ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే
పూర్తి వివరాలు తెలుస్తాయి.