Wednesday, November 24, 2010

కొత్త సీఎంగా కిరణ్‌కూమార్‌రెడ్డి

 ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాజీనామా సమర్పించిన రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. కిరణ్‌కుమార్‌ రేడ్డి రేపు ఉదయం 10 గంటలకు స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారు.

నేటి నుండి యాషెస్‌ పోరు


ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య 133 సంవత్సరాల పోరాటం మరోసారి కొనసాగనుంది. యాషెస్‌ సిరీస్‌గా పేరుగాంచిన ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ గురువారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఆండ్రూ స్ట్రాస్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా యాషెస్‌ సిరీస్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి విజేతగా నిలవాలని ఉబలాటంతో ఉంది. రికీ పాంటింగ్‌ తన నాయకత్వ గరిమను మరోసారి చాటుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. 1988 తరువాత గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా అదే రికార్డును కొనసాగించేందుకు సమయాత్తమవుతుండగా ఆసీస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని స్ట్రాస్‌ బృందం ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకుని శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉత్సుకతో ఉన్నాయి. ఇటీవలి కాలంలో సంచలన విజయాలు సాధిస్తున్న ఇంగ్లండ్‌ ఉత్సాహంతో ఉరకలేస్తుండగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్న ఆసీస్‌ వాటి నుండి పాఠాలు నేర్చుకుని తన ప్రాభవానికి ఎదురులేదని చాటుకోవాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఇటీవలికాలంలో ఆసీస్‌కు పెద్ద దిక్కుగా ఉంటున్న బోల్లింగర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేకపోవడంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు. మిచెల్‌ జాన్సన్‌పై ఆసీస్‌ ప్రధానంగా ఆధారపడుతోంది.సైమన్‌ కటిచ్‌, షేన్‌ వాట్సన్‌, మైఖేల్‌ క్లార్క్‌, మైఖేల్‌ హస్సే మాత్రమే కాదు మార్కస్‌ నార్త్‌ , బ్రాడ్‌ హాడిన్‌, జాన్సన్‌ కూడా పరుగుల వర్షం కురిపించగల సత్తా ఉన్నవారు. రికీ పాంటింగ్‌ ఈ యాషెస్‌ సిరీస్‌ను ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తున్నాడు. జాన్సన్‌తో పాటు సిడిల్‌, బెన్‌ హిల్ఫెన్హాస్‌ ఆసీస్‌ జట్టులో ప్రత్యర్థులను దెబ్బతీయగల బౌలర్లు. ఇంగ్లండ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కెవిన్‌ పీటర్సన్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌ ప్రత్యర్థులపాలిట సింహస్వప్నాలే. అలెస్టర్‌ కుక్‌ ఫామ్‌లో ఉన్నాడో, లేదో తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో పిచ్‌ ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలంగా మారగలదని నిపుణులు భావిస్తున్నారు.