బాలీవుడ్
నటుడు సంజయ్ దత్‌కి తన కుమార్తె త్రిషాలా నటి కావడం ఇష్టంలేదట. ఒకవేళ
త్రిషాలా నటిఅవుతానంటే ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి అంటున్నారు సంజయ్.
జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ నటిస్తున్న తొలి చిత్రం ‘భూమి’. తండ్రీ
కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ కుమార్తెగా
అదితిరావ్ హైదరి నటిస్తోంది. ఆగ్రాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న
సంజయ్‌ను రీల్ లైఫ్ కూతురు అదితికి రియల్ లైఫ్ కూతురు త్రిషాలాకి
పోలికేంటి అని ఓ విలేకరి అడిగారు. ఇందుకు సంజయ్.. ‘త్రిషాలా నటి అవుతానంటే
ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి. కానీ అదితితో నేను అలా చెయ్యలేను’ అని సరదాగా
సమాధానమిచ్చారు.
సంజయ్, ఆయన తల్లిదండ్రులూ నటీనటులే. అలాంటప్పుడు తన పిల్లల్ని సినిమా రంగం వైపు ఎందుకు రానివ్వాలనుకోవడంలేదని మళ్లీ విలేకరులు ప్రశ్నించారు. ‘త్రిషాలాని మంచి, సురక్షితమైన ఉద్యోగంలో చూడడానికి చాలా కష్టపడ్డాను. మంచి కళాశాలలో చేర్పించాలని చాలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఎఫ్‌బీఐలో పనిచేస్తోంది. మరోపక్క ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తోంది. కానీ హిందీ చిత్ర పరిశ్రమలో ఉండాలంటే ముందు తనకి భాష తెలిసుండాలి. అందులోనూ నటి కావడం అంత సులువు కాదు. నటన పైకి గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైన ఉద్యోగం’ అని చెప్పుకొచ్చారు సంజూ బాబా.